Sports

ఒలింపిక్ రజతం

rio-silver-medal-back

 

లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఒలింపిక్  బాడ్మింటన్  ఫైనల్స్  లైవ్ మ్యాచ్ చూసాను …  అందరిలాగే  దేశానికీ గోల్డ్ మెడల్ వస్తుందేమో అన్న ఆశతో… నేను గమనించిన విషయాలు…

Pre-Match Discussions…

నాలుగేళ్ల క్రితం  ఒలింపిక్ పతకం లక్ష్యం తో  గోపీచంద్ ని చేరిన సింధు చాల సాఫ్ట్ అమ్మాయిట … ఆటలో  పాయింట్ వచ్చినా,  పోయినా పెద్ద రియాక్షన్ ఏమి ఉండేది కాదుట..
అలాంటి అమ్మాయికి  గోపీచంద్ మొదట నేర్పిన పాఠం  “Aggression”.   పాయింట్ సాదించగానే  emotional గా   అరవటం కూడా ఆటలో భాగమే అన్నమాట!
గతం లో జరిగిన రెండు వరల్డ్ ఛాంపియన్ షిప్  పోటీలాలలోనూ సింధు  రజతం గెలిస్తే, సింధు తో ఫైనల్లో తలపడిన స్పెయిన్ అమ్మాయి మరీనా  బంగారు పతకాలు సాధించింది. అంటే ఆమెకి వత్తిడిలో ఆడటం బానే అలవాటు అయ్యినట్టుంది..

Situation at Court

కోర్ట్ లోకి ప్రవేశించినప్పుడే ఇద్దరి హావా భావాలూ స్పష్టం గ తెలిసాయి…  ఇద్దరికి ఇది తోలి ఒలింపిక్ ఫైనల్స్ ఏ అయినా … ఏదో ఫార్మాలిటీ పూర్తి చేదాం అన్నట్టుగా మరీనా వస్తే….
కోటి మంది బంగారు పతాకం ఆశల బరువుని తన భుజం  మీద మోస్తూ…  ఉగ్గపట్టి చూస్తున్న  అశేష ప్రజానీకం ఊపిరి లోని అలసటని గుండెళ్ళో  మోస్తూ  అడుగు పెట్టింది సింధు …

Match Starts

మొదటి గేమ్ మొదలు అవ్వగానే పాయింట్స్ సంపాదించటం ప్రారంభించింది మరీనా…  హాఫ్ గేమ్ అయ్యేసరికి  11-6.. లీడ్ లో కూడా ఉంది…  అప్పుడు ఊపుఅందుకుంది సింధు ఆట..  ప్రతీ పాయింట్ కోసం కష్ట  పడుతూ, ఒక్కో పాయింట్ పోగేసుకుంటూ …  17-19 కి చేరింది ..  అప్పుడు కూడా ఒక ఫోర్స్డ్ ఎర్రర్ చేసిన మారినా  తన తప్పుకి తానే ఆహ్లాదంగా
నవ్వుతుంటే,  ఆ నవ్వుకి అప్పోజిషన్  వాడు అయినా సరే  ఆమె కాన్ఫిడెన్స్ కి పడిపోవలసిందే …  ఈ లోగ  సింధు  19-19 కి చేరుకుంది.. మొదటి సారిగా  మరీనా మొహంలో  ఆందోళన ..పరిస్థిని అనలైజ్ చేసేలోగానే  సింధు 21-19 సెట్ గెలిచేసింది …   అందరిలోనూ ఒకటే సంబరం .. బంగారు పతాకానికి మరొక్క అడుగు దూరం మాత్రమే  ఉన్నాం అని…
Sindhu
బహుశా సింధు కూడా అలాగే అనుకుని ఉన్నటుంది… ఒక్క గేమ్… ఇంకొక్క గేమ్  అనుకుంటుండగానే  మరీనా  తన గేర్లు మార్చింది.. అసలు సిసలైన ఛాపింయన్ ఆట లోని
Aggression అంటే ఏమిటో చూపించింది … ఏమి జరిగిందో తెలుసుకునే లోపే సింధు 2-11 తో వెనకపడిపోయింది ..  ఇలాంటి పరిస్థితి లో కోలుకోవటం  సినిమాల్లో తప్ప నిజం గా
అసాధ్యం… అయినా పోరాడింది.. 12 -21 తో గేమ్ ని కోల్పోయింది….
Marinaaa
కానీ పెద్దగా ఎవరు కంగారు పడలేదు కారణం  గతం లో వీళ్లిద్దరు 6 సార్లు తలపెడితే  సింధు 2 సార్లు గెలిచింది.. ఆ 2 మ్యాచ్లు కూడా 3 గేమ్స్ ఆడి గెలిచింది..  ఓడిన 4 మ్యాచ్లు 2 గేమ్స్ లోనే ఓడిపోయింది ..  అందుకని  అంతా  ఉత్కంఠగా  మూడో గేమ్ చూడ సాగారు…
మరీనా టాప్ ఫామ్ అందిపుచ్చుకుని  ఫస్ట్ హాఫ్ లో 4 పాయింట్ల లీడ్ లోకి వెళ్ళింది…  తన జీవితంలోనే అత్యంత విలువైన గేమ్ ఆడుతున్న సింధు పోరాడి పోరాడి 10-10 కి చేరుకుంది.   11-10 తో ఫస్ట్ హాఫ్ ముగిసింది..  ఇదే  సినిమా అయితే ఎలాగుండేదో మనకి అందరికి తెలుసు.. కానీ ఇది వాస్తవం…  మరీనా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఫస్ట్ గేమ్
లో తనకి ఎదురైనా అయోమయ స్థితిని మళ్ళి సింధు కి ఇవ్వకుండా 15-21 తో గేమ్ ని మ్యాచ్ ని కూడా కైవసం చేసుకుంది …..
 download
నూరుకోట్ల భారతీయుల బంగారు పతాకం కల కలగానే మిగిలింది…  దాని స్థానంలో వెండి పతకం  మెరిసింది…  మరీనా ఉద్వేగంగా తన అభిమానులకి అభివాదం చేసి సింధు ని
ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని  సముదాయించి  తన కోచ్ తో కలసి సంబరాలు చేసుకుంది …

Post Match Discussions:

Gopichand and Sindhu had done great job for this country.  This is the first time of recent Olympics that, A women’s badminton final has played with out a china player in it.
Well played Marina.. She deserved to be a Number one player and eligible for gold medal. Sindu did her best and played the biggest match that no other Indian player has ever played at the age of 21 years. She is the true ambassador of Indian Badminton now. And she has bright future as well.
 Gopichand-AFP-2

పతకాల బహూకరణ:

మ్యాచ్ ఆద్యంతం దిగులుగా, కోపంగా కనిపించిన సింధు ఇప్పుడు నవ్వింది. వెండి పతకం మేడలో చేరగానే చిరు నవ్వులు  చిందిస్తూ, పతాకాన్ని అభిమానులకి  చూపిస్తూ,
సగర్వంగా నవ్వింది మన సింధు …..
బంగారు పతాకం అందుకున్న మరీనా…  బ్యాక్ గ్రౌండ్  లో తన దేశ  పతాకం ఎగురుతుంటే… తన జాతీయ గీతం గ్రౌండ్ అంతా  మారు మ్రోగుతుంటే… ఉద్వేగం  ఆపుకోలేక అప్పుడు
ఏడ్చింది…  నిజానికి అది ఏడుపు కాదు…  సంతోషానికి  పతాక  స్థాయి..  23 ఏళ్ళ వయసులో  తన జాతీయ గీతాన్ని ఎన్ని సార్లు  విని ఉంటుంది? కానీ ఈ సారి ప్రపంచ స్థాయి వేదిక మీద, విశ్వ విను వీధిలో, ఏళ్లనాటి  తన తపస్సు ఫలించిన క్షణాన, తన జాతీయ గీతం  సగర్వంగా   వినపడటానికి కారణం మాత్రం తానే..  అందుకే ఆ ఉద్వేగం …
ఇలాంటి ఉద్వేగాన్నే భారత దేశం తరపున ఆడే ప్రతీ క్రీడాకారుడు,  క్రీడాకారిణి కూడా ముందు ముందు పొందాలని కోరుకుంటూ …..
                                                                                                                                                                                    కిషన్ ….
ప్రకటనలు