Childhood

ఉందొ లేదో  నీ స్వర్గం …..

ఉదయం 10 గంటలకి స్కూల్ అయితే 9:45 వరకు టెలి స్కూల్  కార్యక్రమాలు చూసి, తాపీగా  పుస్తకాల పెట్టి పట్టుకుని, దారిలో ఫ్రెండ్స్ ని కలుపుకుని , నడుచుకుంటూ  స్కూల్ కి వెళ్లే ఆ రోజులు ఎంత బాగుండేవి ?
DrSRKH
కమ్మనైన అమ్మ పాట వంటి తెలుగుని నేర్పించే సాయి కుమారి మేడం గారు, భవిష్యత్తుని  ఆశ చూసి ఇంగ్లీష్ ని బోధించే పెద  మేడం గారు, బాష వంట పట్టక పోయినా  మార్కుల కోసం అయినా చదవండిరా  అని  మొత్తుకునే  భాను భాయ్  మేడం గారు,  సైన్స్ ని అతి సరళంగా  బోధించిన  నాగేశ్వరరావు గారు, సువర్చలా  మేడం గారు, చరిత్ర చెబుతూ వర్తమానం మర్చిపోయిన  గోవిందరాజులు గారు,  లెక్కల మాస్టారు అయ్యి ఉండి తిక్క వేషాలు వేసే అప్పల కొండ  గారు,  సోషల్ లాంటి బోరింగు సబ్జెక్టు కె బోర్ కొట్టగల  సత్యవతి మేడం గారు.. పిల్లల తగాదాలకి  పెద రాయుడులా  తీర్పులిచ్చే  పెద్ద సర్ గారు…. ఎంత  మంచి  గురువుల శిక్షణ లో ఆరి తేరమో  కదా….
అరా కోర వసతులతోనే పాఠశాల ఉన్నా,  attendance ఏ మాత్రం తగ్గడానికి అవకాశం ఇవ్వని అందమైన అమ్మాయిలు, స్వచ్ఛంగా  చిగురించిన  స్నేహాలు,  ఆగష్టు 15 కి, జాన్ 26 కి ,  మన క్లాస్ రూమ్స్ ని మనమే మన సొంత డబ్బులు ఖర్చు పెట్టి  అలంకరించుకునే  ఆనవాయితీలు….
స్కూల్ లో నిర్వహించిన వ్యాస రచన పోటీలు, అందులో గెలిచినా బహుమతులు, హద్దు మీరిన పోటీ తత్త్వం రగిల్చిన  అసూయలు, అంతలోనే మనమంతా ఒకటే అని చాటి చెప్పిన
సైన్స్ ఫెయిర్ లు,  అవే  కదా మన విహార యాత్రలు ….
చొక్కాలు చిరిగేలా కబడ్డీ ఆటలు, దుమ్ము లేచేలా బెంచీల మీద ముట్టుకునే ఆటలు, పంట పొలాలలో క్రికెట్లు, గోదావరి నదిలో ఈతలు, ఎంత   మంచి అనుభూతులు? మరపురాని,
తిరిగిరాని మధుర జ్ఞ్యాపకాలూ…
munajat
దేవుడు కనిపిస్తే అడగాలని ఉంది…  “ఉందొ లేదో నీ స్వర్గం… నా బాల్యం నాకు తిరిగిచ్చేయమని”
                                                                                                                                                              కిషన్……
ప్రకటనలు